రాష్ట్రంలో దారుణం.. భర్తను చంపి.. యాసిడ్ పోసి.. ఆ తర్వాత!?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

రాష్ట్రంలో దారుణం.. భర్తను చంపి.. యాసిడ్ పోసి.. ఆ తర్వాత!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ప్రస్తుత సమాజంలో కనీస మానవత్వం లేకుండా భార్య, భర్తలే హత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుంది. మానవత్వం జాడ కనిపించడం లేదనే భావన కలుగుతోంది. చివరి వరకు ఒకటిగా కలిసి బతుకుదాం అని ఏడు అడుగులతో ప్రారంభించిన భార్యాభర్తల జీవన ప్రయాణంలో దారుణమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది.

యూసుఫ్, తబస్సుమ్ ఇద్దరు భార్యభర్తలు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో పెను సంచలనం చోటుచేసుకుంది. భార్య తబస్సుమ్‌కు డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారి ప్రేమకు అడ్డుగా ఉన్న భర్త యూసుఫ్ అనే వ్యక్తిని అతని భార్య తబస్సుమ్, ఆమె ప్రియుడు డానిష్ కలిసి హత్య చేశారు. యూసుఫ్ కాళ్లు, చేతులు కట్టేసి అతని కడుపులో కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహం గుర్తించకుండా చేసేందుకు యాసిడ్ తో కాల్చివేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తబస్సుమ్ ను అరెస్ట్ చేయగా, డానిష్ పరారీలో ఉన్నారు.

Next Story