- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఛత్రపతి శివాజీ ఖడ్గం ఇదేనటా! స్వాగతం పలికిన ప్రజలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘జగదాంబ ఖడ్గం’ ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతానికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘జగదాంబ ఖడ్గం’ ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతానికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. డప్పులు, సంగీత వాయిద్యం, పూల వర్షంతో ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ ఖడ్గం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కానుందని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ, ‘నిన్న మహారాష్ట్రలో మా విజయాన్ని జరుపుకున్నాం. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద జగదాంబ ఖడ్గాన్ని ప్రతిష్ఠిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ముంబైతో పాటు ఇతర మున్సిపాలిటీల్లోనూ విజయం సాధిస్తామని సంకల్పిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జగదాంబ ఖడ్గంతో హైందవ స్వరాజ్యాన్ని స్థాపించారు. ఆ స్ఫూర్తితో మా లక్ష్యానికి పూర్తిగా అంకితమవుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, శివాజీ మహారాజ్ అభిమానులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. వీడియో ఇదే..






