- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్యూల్ కంటే ముందే ముగియనున్న Parliament సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే ముగియనున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే ముగియనున్నాయి. వారం ముందుగానే (డిసెంబర్ 23న) శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సెషన్‌ను త్వరగా ముగించేలా సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను ముందుగానే ముగించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 7న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29న ముగియాల్సి ఉంది.
Next Story






