- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీళ్లు తెప్పిస్తున్న కన్నవారి ప్రేమ.. సీసీ కెమెరాలోనే కూతురికి పలకరింపులు
ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటున్న కూతురిని రోజూ సీసీ కెమెరా ద్వారా పలకరిస్తున్న తల్లిదండ్రులు. ఆత్మీయత నిండిన ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అయినవారికి దూర ప్రాంతంలో గడిపేలా చేస్తున్నాయి. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో సొంత ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లడం అనివార్యమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నలను అలనా పాలన చూసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తమది కాని ప్రదేశంలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారో అనే బెంగ తల్లిదండ్రులను వేధిస్తుంటుంది. తాజాగా తన పెరెంట్స్ కు దూరంగా ఉంటున్న ఓ కూతురు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇది చూసిన వారంతా తల్లిదండ్రుల ప్రేమకు ఫిదా అవుతున్నారు.
కూతురి కోసం అమ్మనాన్న పలకరింపులు:
శివానీ శుక్లా అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరంలో ఉండాల్సి వచ్చింది. దీంతో తాను దూరంగా ఉంటే ఇంట్లో తన తల్లిదండ్రులు సెఫ్టీ ఏంటో అనే బెంగ ఆవిడను వేధించింది. ఈ క్రమంలో ఇంట్లో సర్వైలెన్స్ కెమెరాను ఏర్పాటు చేయించగా ఈ నిర్ణయం ఆమెకు ఓ మధుర అనుభవం మిగిల్చింది. సీసీ కెమెరా ఏర్పాటు చేయించి వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాత శివాని తల్లిదండ్రులు ఆ కెమెరాకు ఎదురుగా వచ్చి లెన్స్ లోకి చూస్తూ ఆమెను పలకిస్తున్నట్లు చేతులు ఊపడం, సమయానికి తిన్నావా అంటూ సైగలు చేయడం చేస్తున్నారు. సీసీ సీసీ కెమెరా ముందు తన తల్లిదండ్రుల పలకరింపులకు సంబంధించిన వీడియోను శివానీ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంట్లో సీసీ టీవీ ఇన్ స్టాల్ చేయడం నా జీవితంలో తీసుకున్నమంచి నిర్ణయం అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లిదండ్రులు పలకరింపుల పట్ల ఫిదా అవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు భాష అక్కర్లేదని దూరంగా ఉన్నా గుండెల్లో ఎప్పుడు తరగని ప్రేమను నింపుకుంటారని కామెట్ చేస్తున్నారు.






