Supreme Court : భార్య బాధితులకు సుప్రీంలో చుక్కెదురు

by Muthe.Rajitha |

భార్య బాధితులకు సుప్రీంకోర్టు(Supreme Court)లో తీవ్ర నిరాశ ఎదురైంది.

Supreme Court : భార్య బాధితులకు సుప్రీంలో చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య బాధితులకు సుప్రీంకోర్టు(Supreme Court)లో తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల విశాల్ అనే వ్యక్తి వరకట్న నిషేధం(Dowry Prohibition Act), గృహహింస(Domestic Violence Act) చట్టాల దుర్వినియోగం అడ్డుకునేలా సంస్కరణలకు ఆదేశాలు ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం(PIL) దాఖలు చేశాడు. అయితే ఈ పిల్ ను సుప్రీంకోర్ట్ విచారణకు అంగీకరించలేదు. చట్టాల సంస్కరణకు తాము ఆదేశాలు చేయలేమని, పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్సీ శర్మ బెంచ్ అభిప్రాయపడింది. ఇప్పటికే కోర్టుల్లో కేసుల భారం అధికంగా ఉందని, కోర్టుల సమయం అత్యంత విలువైనదని.. వాటి సమయం వృథా చేయరాదని పిటిషనర్ కు కోర్ట్ సూచించింది. ఈ చట్టాల్లో సంస్కరణలు తెస్తే గాని వాటి దుర్వినియోగాన్ని అపలేమని, అప్పుడు మాత్రమే తమ బాధలకు చెల్లు చీటి అని ఆశ పడుతున్న భార్య బాధితుల ఆశల మీద నీళ్ళు చల్లినట్టైంది.

Next Story