- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాకు 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు.. లైన్ క్లియర్ చేసిన అమెరికా.. నెక్ట్స్ ఏం జరగబోతుంది?
Tahawwur Rana extradition: ముంబై దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: Tahawwur Rana extradition: ముంబై దాడుల నిందితుడు తహవుర్ రాణా(Tahawwur Rana)ను భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తహవుర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు శనివారం అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) అంగీకరించింది. తహవుర్ ను ఇండియాకు అప్పగించడాన్ని అడ్డుకోవాలని రాణా 2024 నవంబర్ లో రిట్ పిటిషన్ వేశారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్(Donald trump) పగ్గాలు చేపట్టిన తర్వాత 2025 జనవరి 24 సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాణా పిటీషన్ ను కొట్టివేయాలని ఇండియాకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను గతేడాది అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు రాణాను ఇండియాకు అప్పగించడం సబబేనని పేర్కొవడం గమనార్హం.
పాకిస్తాన్ (Pakistan)మూలాలు ఉన్న తహవుర్ రాణా..భారత్ అభ్యర్థనను తిరస్కరించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు వేశాడు. రాణా పిటీషన్ కు వ్యతిరేకంగా 2024 డిసెంబర్ 24న అమెరికా సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రెలోగర్(Elizabeth B. Preloger) సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2008లో పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన ముంబై దాడిలో 166 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈదాడిలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మరణించారు. ముంబై 26/11పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కోల్ మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. హెడ్లీతో కలిసి ముంబై దాడికి పక్కా స్కెచ్ వేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.






