అమెరికా అధ్యక్షుడి ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేసింది.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   (  Updated:2025-05-11 17:14:56  IST  )

కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) గురించి అమెరికా అధ్యక్షుడి ప్రకటన దిగ్భ్రాతికి గురి చేసిందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అజయ్ రాయ్ (UP Congress Chief, MP Ajay Roy) అన్నారు.

అమెరికా అధ్యక్షుడి ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేసింది.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) గురించి అమెరికా అధ్యక్షుడి ప్రకటన దిగ్భ్రాతికి గురి చేసిందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అజయ్ రాయ్ (UP Congress Chief, MP Ajay Roy) అన్నారు. భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన అనంతరం పాక్ డీజీఎంఓ (PAK DGMO) పిలుపు మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ, సైనిక చర్యల విరమణ ఒప్పందాలు జరిగాయి.

దీనిపై యూపీ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతృదినోత్సవం (Mothers Day) సందర్భంగా యూపీ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Former PM Indira Gandhi) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు (Tributes) అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా మనమందరం ఇందిరా గాంధీని స్మరించుకుంటూ ఆమెకు నివాళులు అర్పించాలని సూచించారు.

ఇందిరా గాంధీ మాకు అన్ని విషయాలలో అతిపెద్ద ప్రేరణ అని తెలిపారు. ఆమె 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ (Pakistan)ను మోకరిల్లేలా చేయడమే కాకుండా, దానిని రెండు భాగాలుగా విభజించిందని గుర్తు చేశారు. అంతేగాక కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు (America President) ప్రకటించిన సమాచారం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, పాకిస్థాన్ తో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.

Next Story