- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు.. కేంద్రం అధికారిక ప్రకటన
రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Agriculture Minister Shivraj Singh Chouhan) కీలక ప్రకటన చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులు అధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాను వెల్లడించారు. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తెలిపారు. దేశంలోనే ఏపీ రైతులపై అధిక అప్పుల భారం ఉన్నట్లు చెప్పారు. జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్య ఏపీ రైతు సగటు అప్పు రూ.2,35,554, తెలంగాణ రైతు సగటు అప్పు రూ.1,52,113 ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. దేశఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ, వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. మరోవైపు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ, MSP వంటి ఉపశమన చర్యలు సమస్య మూల కారణాలను పరిష్కరించలేకపోతున్నాయి.






