- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది.. సీజేఐ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
కోర్టులో ప్రతికూల తీర్పులొస్తే న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gawai) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కోర్టులో ప్రతికూల తీర్పులొస్తే న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gawai) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు జడ్జిపై మౌసూమి భట్టాచార్య (Mousumi Bhattacharya)పై అసత్య, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్.పెద్దిరాజు, న్యాయవాదులు రితేశ్ పాటిల్, నితిన్ మేష్రామ్ కేసులో బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ (Vinod Chandran)ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది న్యాయవాదులు, పిటిషనర్లకు వ్యతిరేకంగా తీర్పులొస్తే న్యాయమూర్తులపై అతి దారుణమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న ధోరణి పెరిగుతోందని.. దానినిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.” అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయవాదులు కోర్టు ఆదేశాల పట్ల గౌరవం, సంయమనం పాటించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. అనవసరంగా న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణలు సాధారణం అవుతోంది. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదరన్నారు. అయితే, జస్టిస్ మౌసూమి భట్టాచార్య.. ఆరోపణలు చేసిన ముగ్గురి క్షమాపణలను ఔదార్యంతో ఆమోదించడంతో ఆ కేసును ఇక్కడితో ముగిస్తున్నామని స్పష్టం చేశారు. కేసు ఓడిపోయి న్యాయమూర్తులపై మాటల దాడి చేస్తే.. మరోసారి క్షమాపణతో తప్పించుకోలేరని.. జరిగిన అవమానానికి న్యాయం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.






