- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nimisha Priya Verdict : ఎట్టకేలకు వీడిన సస్పెన్స్..నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!
యెమెన్ (Yemen) దేశంలో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఎట్టకేలకు మోక్షం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్ (Yemen) దేశంలో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. హత్య కేసులో ఆమెకు విధించిన ఉరిశిక్ష రద్దు చేసేందుకు అక్కడి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ హేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి సోమవారం అర్ధరాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవానికి జులై 16నే నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. భారత ప్రభుత్వం రాయబారంతో ఆ తంతు వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత విదేశాంగ శాఖ చర్చలు జరిపింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు సూఫీ షేక్ హబీబ్.. సున్నీ లీడర్ అబూబకర్ కలిసి యెమెన్ సర్కార్‌తో చర్చించారు. ఈ పరిణామంతో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరిస్తున్నట్లుగా ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ జస్టిస్ ప్రతినిధి ధృవీకరించారు. కానీ, నిమిష ప్రియను విడుదల చేస్తారా.. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షకు చేంజ్ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, హత్యకు గురైన యెమెన్ పౌరుడు మహదీ కుటుంబంతో చర్చల తరువాతే ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
అయితే, కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియ (Nimisha Priya) వృత్తి రీత్యా యెమెన్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడి దేశీయుడైన తలాల్ అబ్దో మహదీ (Talal Abdo Mahdi)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ క్లినిక్ కూడా ప్రారంభించారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో తలాల్ అబ్దో మహదీ, నిమిషను మానసికంగా వేధించాడు. ఆ తట్టుకోలేని నిమిష ప్రియ అతడికి మత్తు మందు ఇచ్చి చంపేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు నిమిష ప్రియ అనే తేల్చుతూ కోర్టులో పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.






