ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 08:44:23  IST  )

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.

ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి రేపటి నుంచి ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ కార్యవర్గ సభ్యులకూ నామినేషన్లు వేసే అవకాశం కూడా ఉంది. అయితే, 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా (Jaganth Prakash Nadda) పదవీ కాలం 2023లో ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల, ఇతర కారణాలతో ఆయన పదవీ కాలం పొడిగించగా.. ప్రస్తుతం ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, పార్టీ అధిష్టానం పాటు ముఖ్య నాయకుల సమావేశం అనంతరం ఓ అభ్యర్థిని జాతీయ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసి నామినేషన్ వేయిస్తారు. అప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అవుతంది. కానీ, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే.. రాష్ట్ర రాజధానులలో ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం పోలైన ఓట్లను ఢిల్లీ బీజీపీ ప్రధాన కార్యాలయంలో లెక్కిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అభ్యర్థి కనీసం 15 సంవత్సరాల పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధన ఉంది. ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.

Next Story