దేశంలో జనగణన తొలి విడతకు రంగం సిద్ధం

by Muthe.Rajitha |

దేశంలో 2027 జనాభా లెక్కల తొలి దశకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

దేశంలో జనగణన తొలి విడతకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో 2027 జనాభా లెక్కల తొలి దశకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సెన్సస్‌ను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనుండగా, ఇది భారతదేశంలోనే తొలి డిజిటల్ సెన్సస్‌గా నిలవనుంది. తొలి దశగా హౌస్‌లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ సేకరణను 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ దశకు సంబంధించిన ప్రీ-టెస్ట్ పూర్తయ్యింది. రెండో దశలో జనాభా లెక్కలు (పాప్యులేషన్ ఎన్యూమరేషన్) 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఈసారి సెల్ఫ్-ఎన్యూమరేషన్ వంటి కొత్త విధానాలను అమలు చేయనుండగా, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని బట్టి 30 రోజుల వ్యవధిలో తొలి దశను పూర్తి చేయనున్నారు. చివరిసారిగా 2011లో సెన్సస్ నిర్వహించగా, కోవిడ్ కారణంగా 2021 సెన్సస్ వాయిదా పడింది. తాజా సెన్సస్ ద్వారా జనాభా, గృహాలు, ఆర్థిక పరిస్థితి వంటి కీలక సమాచారం సేకరించి, డిజిటల్ విధానంతో మరింత ఖచ్చితత్వం, వేగం సాధించనున్నారు.

Next Story