ఛీ ఛీ.. అర్ధరాత్రి బైక్ పై ప్రేమ జంట రొమాన్స్.. మరో బైకర్ ప్రశ్నించడంతో.. యువతి రియాక్షన్!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-28 06:36:12  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన నిమిషాల్లో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

ఛీ ఛీ.. అర్ధరాత్రి బైక్ పై ప్రేమ జంట రొమాన్స్.. మరో బైకర్ ప్రశ్నించడంతో.. యువతి రియాక్షన్!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన నిమిషాల్లో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వింతలు, విశేషాలు, షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలకు కొదవ లేదు. ఇటీవల కాలంలో ప్రమాదకరమని తెలిసినా కొందరు చేస్తున్న వికృత చేష్టలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల యూపీ(Uttar Pradesh)లోని నోయిడాలో ఓ జంట హెల్మెట్ ధరించకుండా, వేగంగా బైక్ నడుపుతూ రొమాన్స్ చేస్తూ, ప్రమాదకర స్టంట్‌లతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వారికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా కూడా విధించారు. అయితే ఈ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ వీడియో దర్శనమిచ్చింది. తాజాగా యూపీలోని ఫిరోజాబాద్‌లో బైక్ పై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ప్రియుడు తన ప్రేయసిని పెట్రోల్ ట్యాంక్ పై పడుకోబెట్టి బైక్ నడుపుతూ రొమాన్స్ చేస్తూ, ప్రమాదకర స్టంట్‌లు చేశారు. ఈ ఘటనను అటువైపుగా వెళ్తున్న మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. అర్ధరాత్రి బైక్ పై ఇలా చేయడం సరికాదని సదరు బైకర్ ప్రశ్నిస్తే.. నీకెందుకంటూ ఆయువతి వాదనకు దిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో(Video) చూసిన నెటిజన్లు.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Next Story