ఢిల్లీ సీఎం పై దాడి.. అసలు కారణం ఇదే..?

by Malleboina Mahesh |

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి పాల్పడిన వ్యక్తి తల్లీ మీడియా ముందుకు వచ్చి.. దాడికి కారణం తెలిపింది.

ఢిల్లీ సీఎం పై దాడి.. అసలు కారణం ఇదే..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని ఢిల్లీ సీఎంపై ఈ రోజు ఓ దుండగుడు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ.. ‘జన్ సువాయ్’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు తెలుసుకుంటుంది. ఈ క్రమంలో రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ భాయ్ ఖిమ్జీభాయ్ సకారియా అనే వ్యక్తి సీఎం చెంపపై కొట్టినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు సీఎం పై దాడి చేసిన వ్యక్తిని అక్కడి నుంచి లాక్కెళ్లి దేహశుద్ధి చేశారు. అయితే సీఎంపై అతను దాడి చేయడానికి అసలు కారణం.. దుండగుడి తల్లి మీడియాకు చెప్పుకొచ్చింది.

ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన తీర్పు (Verdict on stray dogs)తో అసహనానికి గురైన తన కొడుకు సీఎం రేఖా గుప్తాను కలిసేందుకు వచ్చినట్లు తెలిపింది. మొదటి నుంచి తన కుమారుడి ప్రవర్తన ఇలానే ఉంటుందని, అతను తనతో పాటు కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారిపై కూడా అనేక సార్లు దాడికి పాల్పడినట్లు రాజేష్ భాయ్ తల్లి మీడియాకు చెప్పుకొచ్చింది. సీఎం పై దాడి చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం మానసిక పరిస్థితి సరిగా లేదని అతన్ని విడిపించేందుకు సీఎం రేఖా గుప్తా మాత్రమే సహాయం చేయగలరని.. సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

Next Story