- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాకు పాకిన ఫ్రీ బస్సు హామీ.. డెమొక్రటిక్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చి.. ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చి.. ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే “ఫ్రీ బస్” హామీ అమెరికాలోనూ రాజకీయ గేమ్‌చేంజర్‌గా నిలిచి, భారత్ లోనే కాదు న్యూయార్క్ లోను ఫ్రీ పథకాలకు ఓట్లు పడతాయని నిరూపించింది. ఈ హామీతో మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయనను ఓడించేందుకు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. మమ్దాని విజయంలో ఉచిత సిటీ బస్సు ప్రయాణం అత్యంత ప్రభావం చూపినట్లు స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతికి చెందిన 34 ఏళ్ల మమ్దాని, సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే.. కరోనా కాలంలో ప్రారంభమైన ఫ్రీ బస్ పైలట్ ప్రాజెక్టును విస్తరించి, న్యూయార్క్‌లోని అన్ని నగర బస్సులను ఉచితంగా మార్చాలనే ప్రణాళికను మమ్దాని తన ప్రచారంలో ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. బస్సుల వేగం పెంచడానికి ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాజెక్టు ఖర్చు కోసం కార్పొరేట్ పన్నులు, అధిక ఆదాయ వర్గాలపై పన్నులు పెంచాలని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రత్యర్థి, మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమో ఈ ప్రతిపాదనను విమర్శించినా ప్రజలు మమ్దానికే మద్దతు ఇచ్చారు. ఇలా, “ఫ్రీ బస్సు” హామీ భారత్ నుంచి అమెరికాకు చేరి రాజకీయాల్లో ప్రభావం చూపుతోందని జోరుగా చర్చ కొనసాగుతోంది.






