- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణను తప్పించలేదు.. అసలు నిజం ఏంటో వెల్లడించిన పీఐబీ
పీఎం మిత్ర పథకం కింద దేశంలో ఏర్పాటు చేయబోతున్న 7 మెగా టెక్స్ టైల్ పార్కుల జాబితా నుంచి తెలంగాణను తప్పించారు అంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పీఎం మిత్ర పథకం కింద దేశంలో ఏర్పాటు చేయబోతున్న 7 మెగా టెక్స్ టైల్ పార్కుల జాబితా నుంచి తెలంగాణను తప్పించారు అంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని, మెగా టెక్స్ టైల్ పార్కుల కోసం ఎంపిక చేసిన 7 నగరాల్లో తెలంగాణ నుంచి వరంగల్ ఒకటి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ బుధవారం ఓ ట్వీట్ చేసింది. కాగా ఓ ఆంగ్ల దినపత్రిక లో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది రోజులకే కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ తెలంగాణను జాబితా నుంచి తప్పించినట్లు సమాచారం ఉందంటూ ఓ కథనాన్ని ప్రచురితం చేయగా ఇది తప్పుడు కథనం అని పేర్కొంది.
కాగా పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు 5 ఎఫ్ (ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు) లక్ష్య దృష్టికి అనుగుణంగా టెక్స్ టైల్స్ పార్కులను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రధాని గత నెలలో ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటి వల్ల కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని పీఎం మోడీ తెలియజేశారు.






