- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేబులో పేలిన ఫోన్.. మంటలు చేరరేగడంతో
by Kodari Anjali |
ఈ మధ్యకాలంలో ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. చార్జింజ్ పెట్టినప్పుడు గానీ, ఫోన్ అధికంగా వేడేక్కి గానీ, అకస్మాత్తుగా పేలుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలోని త్రిసుర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. టిఫిన్ చేయడానికి అని 76 ఏళ్ల ఓ వ్యక్తి హోటల్‌కు వెళ్లాడు. అక్కడ కుర్చీలో కుర్చుని ఉండగా, సడన్‌గా జేబులో ఉన్న మొబైల్ పేలింది. వెంటనే అప్రమత్తమైన అతడు జేబులో నుంచి ఫోన్‌ను కిందపడేశాడు. అప్పటికే చొక్కాకు మంటలు అంటుకున్నాయి. ఆ వ్యక్తి చేతిలో మంటలు ఆర్పేశాడు. కాగా ఈ దృశ్యాలు హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. కేరళలో గత నెల రోజుల నుంచి ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడోసారి.
Next Story






