- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tsunami: రాకాసి అలలు.. రోడ్లపై జనం పరుగులు
రాకాసి అలలు.. రోడ్లపై జనం పరుగులు పెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యాలోని కామ్చాట్కా దీప్వకల్పంలో సంభవించిన భారీ భూకంపం (Russia Earthquake) ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసింది. దీంతో రష్యా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. భారీ ఎత్తున భవనాలు, నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల అలల ధాటికి తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. రష్యా, జపాన్ తీర ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ భూకంపం ఎఫెక్ట్ కనిపించింది. పసిఫిక్ తీరంలో రాకాసి అలలు ఎగిసిపడడంతో హవాయి నుంచి జపాన్ వరకు తీరమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా సహా మరికొన్ని దేశాల్లో సునామీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలస్కాలోని కొన్ని ప్రాంతాలను సైతం అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది.
సైరన్లతో సురక్షిత ప్రాంతాలకు..
సునామీ హెచ్చరికలతో హవాయి (Hawaii) బీచ్ లన్నీ అలర్ట్ అయ్యాయి. ప్రభుత్వం సునామీ సైరన్లు మోగించడంతో జనం అప్రనమత్తమయ్యారు. ఒక్కసారిగా ప్రజలంతా కార్లలో రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా హవాయి ద్వీపంలో సునామీ హెచ్చరికలను అధికారులు వెనక్కి తీసుకున్నారు.






