- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Padma Awards Cermony : కాసేపట్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదానం
భారత అత్యున్నత పద్మ పురస్కారాల(Padma Awards) ప్రదానోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో మొదలవనుంది.

దిశ, వెబ్ డెస్క్ : భారత అత్యున్నత పద్మ పురస్కారాల(Padma Awards) ప్రదానోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో మొదలవనుంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఈ అవార్డులను అందజేయనున్నారు. కాగా76వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని 2025 కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. అందులో తెలంగాణ(Telangana)కు రెండు రాగా.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు దక్కాయి.
ఇక ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ, కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించాయి. వీరంతా నేడు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, అవార్డు గ్రహితల కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.






