- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్ కతా లో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
కోల్ కతా ట్రెయినీ డాక్టర్ హత్య కేసులో.. నేటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా ట్రెయినీ డాక్టర్ హత్య కేసులో.. నేటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో భాగంగానే.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకురాలు అపర్ణా సేన్ తో సహా.. బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు ఆదివారం(సెప్టెంబర్ 1) వేలాది మంది ప్రజలతో కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మెగా నిరసన ర్యాలీ, కాలేజ్ స్ట్రీట్ నుండి బయలుదేరగా.. ఈ ర్యాలీలో స్వస్తిక ముఖర్జీ, సుదీప చక్రవర్తి, సోహినీ సర్కార్, చైతీ ఘోషల్.. ఇంకా పలువురు నటీనటులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న నటి, దర్శకురాలు అపర్ణా సేన్ మాట్లాడుతూ.. "బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని.. ఆమెకు సరైన న్యాయం దొరక్కపోతే తాము మళ్లీ ఉద్యమిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై నిజం తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇది మన బాధ్యత కూడా అని అన్నారు. అయితే తమకు న్యాయవ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తుపై తాము ఆశాజనకంగా ఉన్నట్లు" దర్శకురాలు అపర్ణా తెలిపారు.






