- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China New Virus: మరో బాంబు పేల్చిన చైనా.. కరోనా తరహా వైరస్ గుర్తింపు.. మనుషులకు డేంజర్
China New Virus: కోవిడ్ (Covid -19)19 వచ్చిన 5ఏళ్ల తర్వాత చైనాలో మరోసారి కొత్త వైరస్(China New Virus) ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: China New Virus: కోవిడ్ (Covid -19)19 వచ్చిన 5ఏళ్ల తర్వాత చైనాలో మరోసారి కొత్త వైరస్(China New Virus) ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. దీని లక్షణాలు కూడా కరోనా వైరస్ లక్షణాలనే పోలి ఉంటాయి. కరోనా లాంటి కొత్త వైరస్ కూడా వుహాన్ ల్యాబ్‌లో గుర్తించారు.అయితే ఈ కొత్త వైరస్ మానవులలో గుర్తించలేరు. ఇది జంతువులలో గుర్తించినప్పటికీ.. ఇది మానవులకు కూడా చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు
చైనాలో కొత్తవైరస్ (China New Virus) ను గుర్తించారు పరిశోధకులు. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వూరస్ ను హెచ్ కెయూ5 కోవ్ 2గా పిలుస్తున్నారు. ఈ వైరస్ కోవిడ్ 19 కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు ఎన్నో కథనాలు పేర్కొన్నాయి. గబ్బిలాల్లో కోవిడ్ వైరస్(China New Virus) లపై ఎన్నో పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ఝెంగ్ లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతోపాటు వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం సెల్ జర్నల్ లో ప్రచురితం అయ్యింది.
ఈ వైరస్ మెర్బెకోవైరస్ తోపాటు ప్రాణాంతక మెర్స్ కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చేశారు. ఇది హెచ్ కేయూ5 కోవిడ్ వైరస్ సంతతికి చెందినదిగా వెల్లడించారు. ఈ వైరస్ ను మొదట హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించినట్లు తెలిపారు. తాజా పరిశోధన ప్రకారం HKU5-CoV-2నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ 19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ వైరస్ మానవులకు సోకుతుందని తేలినా..కోవిడ్ మాదిరి ప్రమాదకారి కాదని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ రకానికి చెందిన వైరస్ లతో ఇబ్బంది ఉన్నా అన్ని వైరస్ లు జంతువుల నుంచి మానవులకు అంత సులభంగా సోకే ఛాన్స్ లేదని వివరించారు. గతంలో వచ్చిన సార్స్, మెర్స్ వైరస్ లకు మనిషి నుంచి మనిషికి సులభంగా సోకేశక్తి ఉందని తెలిపారు. అదే ప్రస్తుత HKU5-CoV-2వైరస్ కు ఇంత సామర్థ్యం లేదని వెల్లడించారు. ఫలితంగా మానవుల్లో వ్యాప్తి చెందే ఛాన్స్ తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.






