- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోడో యాత్రలో రాహుల్ గాంధీ పైకి దూసుకువచ్చిన వ్యక్తి (వీడియో)
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీపైకి ఓ వ్యక్తి దూసుకురావడం కలకలం రేపింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఈరోజు పాదయాత్ర కొనసాగుతుండగా ఓ వ్యక్తి రాహుల్ గాంధీ వైపు పరిగెత్తుకువచ్చాడు. వెంటనే రాహుల్ గాంధీని కౌగిలించుకున్నాడు. ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా అయోమయం చెందారు. వెంటనే తేరుకున్న సెక్యురిటీ సిబ్బంది, పార్టీ నేతలు ఆ చొరబాటుదారుడిని పక్కకు లాగారు. అయితే భారత్ జోడో యాత్ర సున్నితమైన ప్రాంతాల్లో కొనసాగుతున్నందున యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని రాహుల్ గాంధీకి సెక్యూరిటీ పెంచాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాహుల్ కు కల్పిస్తున్న భద్రతపై సీఆర్ఫీఎఫ్ ఇటీవల నివేదిక కోరింది.
దీంతో సీఆర్పీఎఫ్ తాజాగా కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తూ ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది. గత మూడేళ్లలో రాహుల్ గాంధీనే వందల సార్లు భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ విభాగం వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా మరో వ్యక్తి రాహుల్ గాంధీ వద్దకు చొరబడి కౌగిలించుకున్న ఘటన సంచలనంగా మారింది. కాగా రాహుల్ గాంధీకి ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. ఎనిమిది నుండి తొమ్మిది మంది కమాండోలు ఆయనకు 24x7 కాపలాగా ఉన్నారు.






