చైనాలో కొండపైకి ఎక్కేందుకు ఎస్కలేటర్స్.. చూస్తే మతిపోవాల్సిందే

by Ajay Maddhiboyina |

టెక్నాలజీ అంటే వినిపించే పేర్లలో చైనా ముందువరుసలో ఉంటుంది. టెక్నాల‌జీ సాయంతో చైనా ఎన్నో అద్బుతాలు సృష్టించింది. ఇక్కడ ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన‌,

చైనాలో కొండపైకి ఎక్కేందుకు ఎస్కలేటర్స్.. చూస్తే మతిపోవాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్: టెక్నాలజీ అంటే వినిపించే పేర్లలో చైనా ముందువరుసలో ఉంటుంది. టెక్నాల‌జీ సాయంతో చైనా ఎన్నో అద్బుతాలు సృష్టించింది. ఇక్కడ ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన‌, ఎత్తైన గ్లాస్ వంతెన ఉంది. అంతేకాకుండా చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే అక్క‌డ ఎత్తైన కొండ‌ల‌ను ఎక్కేందుకు వాటిపై ఎక్స‌లేట‌ర్ల‌ను నిర్మించారు. జియాంగ్సి అనే ప్రాంతంలో ఎత్తైన కొండ‌లపై ఈ లింగ్షాన్ అనే ఎక్స‌లేట‌ర్ ఉంది. దీనిని 2022లోనే చైనా నిర్మించ‌డం విశేషం.

కొండ‌ల‌పై ఉన్న పెద్ద‌పెద్ద రాళ్లపై ఇంట‌ర్ లింకింగ్‌తో దీనిని నిర్మించారు. ఒక్కో ఎక్సలేటర్ మధ్య కొండపై నుండి ప్రకృతి అందాల‌ను చూసేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చేలా ఔట్ డోర్ స్టేష‌న్లు ఏర్పాటు చేశారు. దీనిని నిర్మించే ముందు ఇంజ‌నీర్లు భూభాగాన్ని స‌ర్వే చేసి, కాంక్రీట్ ఉప‌యోగించి నిర్మించారు. దీనిపై ఎక్కే ప‌ర్యాట‌కుల‌ భ‌ద్ర‌త కోసం చూట్టూ రెయిలింగ్ చేశారు. ఈ మొత్తం కొండ ఎత్తు 1,500 మీటర్లు కాగా నిర్మించేందుకు కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ప్ర‌స్తుతం చైనాలోని ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క కేంద్రాల‌లో ఇది కూడా ఒక‌టిగా నిలిచింది.

Next Story