- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చార్‌ధామ్ యాత్రలో ఐదో ప్రమాదం.. ఎప్పుడేం జరిగిందంటే?
by Phanindra |
చార్‌ధామ్ యాత్రలో తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇది ఈ యాత్ర మొదలైన తర్వాత జరిగిన ఐదో ప్రమాదం కావడం గమనార్హం.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఏప్రిల్ 30న ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో ఇప్పటి వరకు ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఆదివారం జరిగిన ఘటన ఐదో హెలికాప్టర్ ప్రమాదం. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. క్రాష్ ల్యాండింగులు, ఎమర్జెన్సీ ల్యాండింగులు, ప్రమాదాలు ఈ తీర్థయాత్రలో భాగంగా మారిపోయాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడటం గమనార్హం.
- జూన్ 7న క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన మరో హెలికాప్టర్.. బదాసు నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా హైవేపై క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలవలేదు. అయితే ఈ రెండో ఘటన తర్వాత క్రిస్టల్ ఏవియేషన్‌పై డీజీసీఏ నిషేధం విధించింది.
- మే 17న కేదార్‌నాథ్‌లోని హెలీప్యాడ్ వద్ద ఎయిమ్స్ రిషికేష్‌కు చెందిన హెలి అంబులెన్స్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నా.. హెలి అంబులెన్స్ వెనుక భాగం బాగా దెబ్బతిన్నది.
- మే 13న బద్రినాథ్ నుంచి తిరిగొచ్చే సమయంలో సాంకేతిక సమస్యతో ఒక హెలికాప్టర్‌లో టర్బలెన్స్ సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాప్టర్‌ను ఉకిమఠ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
- మే 8న క్రిస్టల్ ఏవియేషన్‌కు చెందిన ఒక హెలికాప్టర్ గంగానీ జిల్లా వద్ద క్రాష్ అయింది. ఖర్‌షాలీ నుంచి ఝాలా వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు ప్రయాణికులతోపాటు పైలట్ కూడా దుర్మరణం చెందారు.
Next Story






