- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పల్లీపట్టీల నిలిపివేత!
పల్లీపట్టీలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

దిశ,వెబ్‌డెస్క్: పల్లీపట్టీలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పల్లీలు బెల్లంతో కలిపి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండూ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్, ఫాస్పరస్, నియాసిస్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా అందిస్తాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) ప్రభుత్వ పాఠశాల(Govt School)ల్లో ఇక నుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో వాటిలో అత్యధికంగా చక్కెర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గడువు ముగిసిన, సరిగా నిల్వ చేయని పల్లీపట్టీలు కూడా ఉన్నట్లు తేలడంతో పంపిణీని నిలిపివేస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లలో పల్లీపట్టీలకు బదులుగా గుడ్డు లేదా అరటి పండ్లు పంపిణీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 2021 నుంచి మధ్యాహ్న భోజన సమయంలో గుడ్లు తినని విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం అరటి పండ్లు లేదా వేరుశనగ- బెల్లంతో చేసిన చిక్కీలను పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.






