- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 ఏళ్ల తర్వాత ఆక్వా రైతుల మొహాల్లో వెల్లివిరిసిన ఆనందం
దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆక్వా రైతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది.

దిశ, వెబ్ డెస్క్ : దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆక్వా రైతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. 2016 డిసెంబరులో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో రొయ్యల్లో వైట్ స్పాట్ వైరస్(WSSV)ను గుర్తించిన తర్వాత 2017 జనవరి 6 నుంచి పొట్టు తీయని రొయ్యల దిగుమతులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో భారత ఆక్వా రైతులు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక విజ్ఞప్తితో పొట్టు తియ్యని రొయ్యలను తమ దేశంలోకి దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆస్ట్రేలియా.
దీని ద్వారా దేశంలోని ఆక్వా రైతులు, ముఖ్యంగా విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే ఏపీలోని 80 శాతం ఆక్వా రైతులకు భారీ ఊరట లభించింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొన్ని షరతులతో ఈ ఆక్వా ఉత్పత్తుల దిగుమతికి అంగీకారం తెలిపింది. సేంద్రియ పద్దతిలో మాత్రమే రొయ్యలు పెంచాలని, వాటిని వైరస్ లేని ప్రాంతంలో స్టోర్ చేయాలని కండిషన్స్ విధించింది. అలాంటి ఆక్వా ఉత్పత్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది.
అయితే 8 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో భారత ఆక్వా ఉత్పత్తుల్లో 70 శాతం అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ట్రంప్ ఇటీవల భారీగా టారిఫ్ లు పెంచడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి అనుమతివ్వాలని ఆస్ట్రేలియాను కోరగా అందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. ఏది ఏమైనా... ఇది ఆక్వా రైతులకు సంతోషకరమైన విషయమే.






