వైద్యురాలి లైంగిక దాడి ఘటన.. 12 గంటల బంద్ కు బీజేపీ పిలుపు

by Geesa Chandu |

కోల్ కతా వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

వైద్యురాలి లైంగిక దాడి ఘటన.. 12 గంటల బంద్ కు బీజేపీ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. కోల్ కతాలో జరిగిన దారుణం పట్ల, బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర సెక్రటేరియట్ వరకూ చేపట్టిన "నబన్నా అభియాన్" ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నిరసనకారులపై.. లాఠీచార్జ్, జల ఫిరంగులు, టియర్ గ్యాస్ లను ప్రయోగించినందుకు నిరసనగా.. బుధవారం పశ్చిమ బెంగాల్ మొత్తం 12 గంటల బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది.

లైంగిక దాడికి గురైన డాక్టర్ కు న్యాయం జరగాలన్న ప్రజల డిమాండ్ ను ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేలా చేయడానికే.. బెంగాల్ లో 12 గంటల బంద్ కు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా మజుందార్ వెల్లడించారు. ఈ సందర్భంగా మజుందార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులుగా.. మహిళలకు రక్షణ కావాలని నిరసనలు తెలుపుతున్న వారిపై మమతా బెనర్జీ దాడి చేయించడం ఏంటని సుకాంత ప్రశ్నించారు.

Next Story