- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లాస్‌రూమ్‌లో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం
పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రంలోని నాదియా జిల్లా(Nadiya District)లో మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్లాస్ రూమ్(Class Room)లో సీనియర్ మహిళా ప్రొఫెసర్(Professor)-స్టూడెంట్(Student) బెంగాల్

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రంలోని నాదియా జిల్లా(Nadiya District)లో మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(Maulana Abul Kalam Azad University of Technology) క్లాస్ రూమ్(Class Room)లో సీనియర్ మహిళా ప్రొఫెసర్(Professor)-స్టూడెంట్(Student) బెంగాల్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న వీడియో(Video) ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. పూల దండలు మార్చుకొని.. ప్రొఫెసర్ నుదుట స్టూడెంట్ బొట్టు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సంచలనం రేకిత్తించడంతో ప్రభుత్వం యూనివర్సిటీ యంత్రాంగం స్పందించి.. విచారణకు ఆదేశించింది.
అయితే ఇది తన క్లాస్‌లో భాగమైన డ్రామా అని ప్రొఫెసర్ చెబుతున్నారు. విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరోసారి మహిళా ప్రొఫెసర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని పేర్కొన్నారు. ఆమె రాజీనామా పై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఆ పెళ్లి ఓ ప్రాజెక్టు(Project)లో భాగమని మహిళా ప్రొఫెసర్ చెబుతున్నారు.






