- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jammu: ఏరివేత షురూ.. త్రాల్‌లో ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లు పేల్చివేత
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత షురూ అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్(JammuKashmir)లో ఉగ్రవాదుల ఏరివేత షురూ అయింది. పహల్గాందాడిలో 26 మంది భారతీయుల(Indians)ను బలితీసుకున్న ఉగ్రమూకలు మళ్లీ కవ్మింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత భద్రతా దళాలు(Indian Security Forces) ఉగ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. లోకల్ ఉగ్రవాదులను కూడా వదిలిపెట్టడంలేదు. కాల్చి పారేస్తున్నారు. త్రాల్‌లో ఉగ్రవాది ఆదిల్ షేక్(Adil Sheikh) ఇల్లును పేల్చివేశారు. ఐఈడీ బాంబు(IED Bomb)లతో విరుచుకుపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack)లో ఆదిల్ షేక్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. బిజ్ బెహారా, త్రాల్ ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించాయి. ప్రతి కదలికను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. పరిసరా ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.
Next Story






