- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. షాకిచ్చిన వధువు
by Mallepaka Hamsa |
ఓ వ్యక్తి మద్యం మత్తులో కల్యాణ మండపానికి ఆలస్యంగా వచ్చాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి మద్యం మత్తులో కల్యాణ మండపానికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో వధువు ఏకంగా పెళ్లి రద్దు చేసుకుని వరుడికి షాక్ ఇచ్చింది. ఈ ఘటన బీహార్ భాగల్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భాగల్ పూర్‌కు చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. మంగళవారం ఉదయం ముహుర్తాన్ని ఖరారు చేశారు.
వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూసింది. ముహుర్త సమయం దాటినా పెళ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. వరుడు మాత్రం మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. ఇది గమనించిన వధువు నాకీ పెళ్లి వద్దంటూ తిరస్కరించింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Next Story






