- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూరదర్శన్‌లో ముగిసిన స్వర్ణయుగం.. న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి కన్నుమూత
దూరదర్శన్ వార్తా ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: దూరదర్శన్ (Doordarshan) వార్తా ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. తన మధురమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో దశాబ్దాల పాటు కోట్లాది మంది వీక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తుదిశ్వాస విడిచారు. 1976లో పీహెచ్‌డీ (PhD) చేస్తున్న సమయంలోనే ఆమె దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా చేరారు. భారత టెలివిజన్ చరిత్రలో లైవ్‌లో వార్తలు చదివిన తొలితరం యాంకర్లలో ఆమె ప్రసిద్ధిగాంచారు. 1984 వరకు దూరదర్శన్‌లో పనిచేసిన తర్వాత ఆమె యూకే (United Kindom) వెళ్లారు. అక్కడ 1986 వరకు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ (BBC)లో న్యూస్ రీడర్‌గా సేవలందించారు. 1988లో తిరిగి భారత్‌కు వచ్చి మళ్లీ దూరదర్శన్‌లోనే చేరారు.
సరళా మహేశ్వరి మృతి పట్ల ఆమె సహచర యాంకర్ షమ్మీ నారంగ్ (Shammi Narang) మాట్లాడుతూ.. ఆమె దయ, మర్యాదకు నిలువుటద్దమని కొనియాడారు. భాషపై ఆమెకు ఉన్న పట్టు అద్భుతమని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సరళా మహేశ్వరి ఆమె అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తున్నారు.






