- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు.. తెరుచుకున్న హిరాకుడ్ డ్యామ్ గేట్లు
ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని హిరాకుడ్ ఆనకట్ట గేట్లను ఈ రోజు(ఆదివారం) తెరిచారు.

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని హిరాకుడ్ ఆనకట్ట గేట్లను ఈ రోజు(ఆదివారం) తెరిచారు. హిరాకుడ్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒడిశా రాష్ట్రం సంబల్పూర్‌లోని హిరాకుడ్ జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఇంజినీర్ సుశీల్ కుమార్ బెహరా తెలిపారు. ఈ క్రమంలో నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి విడుదల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
నదిలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ లౌడ్ స్పీకర్ ద్వారా హెచ్చరికను కూడా ప్రకటించారు. హిరాకుడ్ జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 603 అడుగులకు చేరుకుంది. ఈ నెల(జూలై) చివరి నాటికి ఆనకట్ట సాధారణ నీటి మట్టం 605 అడుగులు ఉండాలి. అదనంగా, ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల వల్ల నీటి ప్రవాహం పెరిగినందున వరద నీటిని విడుదల చేస్తున్నట్లు 13 జిల్లాల జిల్లా కలెక్టర్లకు ఆనకట్ట అథారిటీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, రాష్ట్రానికి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






