భారత రక్షణ రంగంలో మరో మైలురాయి.. 'తారా' గ్లైడ్ వెపన్ టెస్ట్ సక్సెస్

by Prasad Jukanti |   (  Updated:2026-05-08 06:03:21  IST  )

సాధారణ వార్‌హెడ్లను ఖచ్చితమైన ఆయుధాలుగా మార్చే 'తారా' గ్లైడ్ వెపన్ వ్యవస్థను DRDO, IAF విజయవంతంగా పరీక్షించాయి.

భారత రక్షణ రంగంలో మరో మైలురాయి.. తారా గ్లైడ్ వెపన్ టెస్ట్ సక్సెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత వైమానిక దళం (IAF) సంయుక్తంగా టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా (TARA) ఆయుధ వ్యవస్థ యొక్క మొట్టమొదటి విమాన పరీక్ష విజయవంతమైంది. గురువారం ఒడిశా తీరంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిచింది.. తారా మాడ్యులర్ రేంజ్ ఎక్స్‌టెన్షన్ కిట్. ఇది సాధారణంగా మార్గదర్శక వ్యవస్థ లేని వార్‌హెడ్స్‌ను కచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ప్రిసిషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చగలిగే భారతదేశపు తొలి స్వదేశీ గ్లైడ్ వెపన్ సిస్టమ్‌గా గుర్తింపు పొందింది. ఈ ఆయుధ వ్యవస్థను హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)తో పాటు ఇతర DRDO ప్రయోగశాలలు అభివృద్ధి చేశాయి. తక్కువ ఖర్చుతో భూభాగంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యాన్ని పెంచేలా దీన్ని రూపొందించినట్లు రక్షణ శాఖ తెలిపింది.

రాజ్‍నాథ్ సింగ్ అభినందనలు

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన తక్కువ ఖర్చు గల వ్యవస్థలను వినియోగిస్తున్న తొలి గ్లైడ్ వెపన్ ఇదేనని అధికారులు పేర్కొన్నారు. డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్‌నర్స్ (DcPP)తో పాటు భారతీయ పరిశ్రమల సహకారంతో ఈ కిట్ అభివృద్ధి చేపట్టగా, ఇప్పటికే ఉత్పత్తి కార్యక్రమాలు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఈ విజయవంతమైన తొలి ఫ్లైట్ ట్రయల్‌పై రక్షణ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ డీఆర్‍డీవో, ఐఏఎఫ్, డీసీపీపీ భాగస్వాములు, పరిశ్రమలకు అభినందనలు తెలిపారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాల అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ, హర్యానాల్లో ఉగ్రదాడుల కుట్ర భగ్నం.. ఆలయాలు, ధాబాలే లక్ష్యంగా ISI ప్లాన్!

Next Story