- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెలువడిన తొలి ఫలితం.. తట్టంచావడి నుంచి CM రంగస్వామి విజయం
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం ఎన్.రంగస్వామి తట్టంచావడి నుంచి ఘన విజయం సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించినట్లుగానే అధికార ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో వెలువడిన అత్యంత తొలి ఫలితంతో సీఎం ఎన్.రంగస్వామి (N Ranga Swamy) విజయకేతనాన్ని ఎగురవేశారు. పోటీ చేసిన తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, నేయం మక్కల్ కజగం అభ్యర్థి వినాయగం (Vinayagam)పై ఆయన స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రంగస్వామి రెండు చోట్ల పోటీ చేయగా.. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరిలో వెలువడిన మొట్టమొదటి ఫలితం ఇదే కావడం విశేషం.
ఏకపక్షంగా సాగుతున్న కౌంటింగ్..
మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 22 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 06, ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రజా వ్యతిరేకతను అధిగమించి రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ (AINRC) బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.
దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజ






