- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026లో తొలి ఖగోళ వింత.. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
2026 మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భారత్‍తో పాటు పలు దేశాల్లో ఏర్పడబోయే ఈ గ్రహణం సమయం పూర్తి వివరాలు ఇవే

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెలలో ఖగోళ వింత ఆవిష్కృతం కాబోతోంది. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) ఏర్పడనుంది. 2026లో ఇదే తొలి గ్రహణం కావడంతో దీనిపై అందరు చర్చించుకుంటున్నారు. మన దేశంలో ఈశాన్య భారత రాష్ట్రాలైన బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‍లో చంద్రగ్రహణం (Chandra Grahan 2026) స్పష్టంగా కనిపించనుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మాత్రం చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపించబోతోంది. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్‍లో ఈ చంద్రగ్రహణం కనిపించబోతోంది.
గ్రహణ సమయం:
నేరుగా చూడవచ్చా:
ఈ గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరంలేదని సైంటిస్టులు చెబుతున్నారు. బైనాక్యులర్లు.. టెలిస్కోప్ వంటి పరికరాలతో వీక్షిస్తే స్పష్టంగా కనపడుతుందని అయితే చీకటి ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణసమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి వక్రీభవనం వల్ల చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. దీనినే ఖగోళ శాస్త్రవేత్తలు 'బ్లడ్ మూన్' (Blood Moon) అని పిలుస్తారు. ఆకాశంలో ఏర్పడబోయే బ్లడ్ మూన్ ఖగోళ ప్రేమికులకు మరియు పరిశోధకులకు ఒక గొప్ప అవకాశం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






