Farmer Family Protest : మోకాళ్ళపై నడిచి రైతు కుటుంబం నిరసన

by Muthe.Rajitha |   (  Updated:2024-12-14 03:52:13  IST  )

భూ సమస్య పరిష్కారం కోసం ఓ రైతు కుటుంబం వినూత్నంగా నిరసన(Protest) తెలిపింది.

Farmer Family Protest : మోకాళ్ళపై నడిచి రైతు కుటుంబం నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : భూ సమస్య పరిష్కారం కోసం ఓ రైతు కుటుంబం వినూత్నంగా నిరసన(Protest) తెలిపింది. తమ భూమికి సంబధించిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం(Deputy Collector Office) వద్ద కుటుంబం మొత్తం మోకాళ్లపై నడిచి(Farmer Family Crawls On Knees) నిరసన తెలియజేశారు. మధ్యప్రదేశ్‌(MP)లోని దేవాస్(Devas) జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఖతేగాన్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు.. తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా, పంట పండించకుండా పొరుగు రైతు అడ్డుకుంటున్నట్లు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఈ సమస్య గురించి విన్నవించినా పట్టించుకోలేదని లక్ష్మణ్‌ ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైతు.. తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి దేవాస్‌లోని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని.. కుటుంబ సభ్యులతో సహ మోకాళ్లపై నడిచి నిరసన తెలిపాడు. ఈ ఘటనపై జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రియా చంద్రావత్ స్పందించారు. అధికారులను అక్కడకు పంపి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాగా రైతు కుటుంబం మోకాళ్ళ మీద నడిచిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Next Story