- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: పాకిస్థాన్ లో మిలటరీదే రాజ్యమా..? చెప్పిన మాట వినకపోతే పాక్ ప్రధానికి సైతం ఉరి తప్పదా..?
Pakistan: 1947 సంవత్సరంలోనే భారత్ పాకిస్థాన్ లకు బ్రిటన్ నుంచి స్వాతంత్రం లభించింది.

దిశ, వెబ్ డెస్క్: Pakistan: 1947 సంవత్సరంలోనే భారత్ పాకిస్థాన్ లకు బ్రిటన్ నుంచి స్వాతంత్రం లభించింది. అప్పటినుంచి దాదాపు 75 సంవత్సరాల పాటు ఇరుదేశాలు, సరిహద్దు తగాదాలతో శత్రు దేశాలుగా మారి, నిత్యం వివాదాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలకు ఈ మధ్య కాశ్మీర్ వివాదం అత్యంత కీలకమైనది అని చెప్పవచ్చు. ఇరుదేశాల మధ్య 4 సార్లు యుద్ధం జరిగింది. ఇందులో మూడుసార్లు కేవలం కాశ్మీర్ కోసమే జరిగింది. 1947 – 1948, 1965, 1971, 1999 సంవత్సరాలలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది.
అయితే యుద్ధాలలో అన్నిసార్లు భారత్ గెలిచింది. ఇందులో 1971లో జరిగిన యుద్ధం కారణంగా పాకిస్తాన్ ఏకంగా రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే గడచిన 75 సంవత్సరాలలో భారతదేశం ఒక సఫలమంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఎదిగితే, పాకిస్తాన్ మాత్రం మిలటరీ నియంతృత్వంలోనే దాదాపు 40 సంవత్సరాలు మగ్గింది. అక్కడ ప్రజాస్వామ్యం కేవలం పేరుకే ఉంటుందని అధికారమంతా మిలటరీ చేతుల్లోనే ఉంటుందని విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు.పాకిస్తాన్‌లో 1958, 1977, 1999 సంవత్సరాల్లో మొత్తం 3 సార్లు మిలిటరీ పాలన జరిగింది. మొదటి సారి మిలటరీ పాలన అక్టోబర్ 1958 – మార్చ్ 1969 మధ్య కాలంలో సాగింది. రెండో సారి జూలై 5, 1977 – ఆగస్టు 17, 1988 మధ్య కాలంలో కొనసాగింది. ఇక మూడోసారి అక్టోబర్ 12, 1999 – ఆగస్టు 2008 మధ్య కాలంలో కొనసాగింది.
పాకిస్తాన్ మిలటరీ పాలనలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా మిలిటరీ అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడి రాజకీయ పార్టీలు కూడా మిలిటరీ అధికారుల కనుసన్నల్లోనే ఉంటాయి. అంతేకాదు దేశంలోని భూభాగంలో ఎక్కువ శాతం మిలటరీకి కేటాయించారు. పాకిస్తాన్ మిలటరీ ఇక్కడి పరిపాలనను ఎన్నికలను, న్యాయ వ్యవస్థను కూడా శాసిస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ ఆధీనంలో అనేక కంపెనీలు సైతం ఉంటాయి. ఈ కంపెనీలు వ్యాపారం సైతం చేస్తాయి. వీటి ద్వారా వచ్చే డబ్బును అక్కడి మిలటరీ మేజర్ జనరల్స్ తమ వ్యక్తిగత ఖర్చులకోసం వాడుకుంటారు.
ప్రజలు మిలటరీని ప్రశ్నించడానికి అర్హత లేదు. మిలటరీ మాట వినలేదని అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికార్ అలి భుట్టో ప్రభుత్వాన్ని కూల దోయడమే కాదు. జైల్లో బంధించి 1979 ఏప్రిల్ 4న ఉరితీశారు. ఇది పాకిస్తాన్ మిలిటరీ రాజ్యం పరిస్థితి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం మిలటరీ ఖర్చులకే సరిపోతాయి. అందుకే పాకిస్తాన్ ఒక మిలటరీ రాజ్యం అని పేరు ఉంది. ఈ మిలిటరీ ముసుగులోనే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సైతం ఊతం అందిస్తూ, ప్రపంచానికి తప్పుడు అందిస్తోంది.
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బిన్ లాడెన్ సైతం పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందాడు. అతని ఆశ్రయం కూడా పాకిస్తాన్ మిలటరీ అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే భారత దేశానికి చెందిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సైతం పాకిస్థాన్లోనే అక్కడి మిలటరీ ప్రోత్సాహంతోనే తలదాచుకున్నాడు. ఇలా సకల పాపాలకు పాకిస్తాన్ మిలటరీ ఒక అరాచక వ్యవస్థగా ఎదిగి భారత్ పట్ల విషాన్ని చిమ్ముతోంది.






