- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ సీక్రెట్ రికార్డింగ్స్ కేసులో ఇక సాక్ష్యాలే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
దాంపత్య వివాదాల కేసులలో భార్య లేదా భర్త రహస్యంగా రికార్డ్ చేసిన టెలిఫోన్ సంభాషణలు ఇక నుంచి ఆధారంగా స్వీకరించబడతాయని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: దాంపత్య వివాదాల కేసులలో భార్య లేదా భర్త రహస్యంగా రికార్డ్ చేసిన టెలిఫోన్ సంభాషణలు ఇక నుంచి ఆధారంగా స్వీకరించబడతాయని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించింది. అదేవిధంగా పంజాబ్, హర్యానా (Punjab & Haryana High Court) హైకోర్టు ఇలాంటి రికార్డింగ్స్ గోప్యతా ఉల్లంఘనగా పరిగణించి, వాటిని ఫ్యామిలీ కోర్టులో ఆధారంగా అనుమతించకూడదని ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ రాష్ట్రంలో భటిండాకు చెందిన దంపతుల కేసుపై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. ఇలాంటి సీక్రెట్ రికార్డింగ్స్ దాంపత్యంలోని సామరస్యాన్ని దెబ్బతీస్తుందని కామెంట్ చేశారు. ఇది ఒకరకంగా తోటి భాగస్వామిపై గూఢచర్యాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. భార్యభర్తలు ఇలా కాల్ రికార్డింగ్స్ చేసే స్థాయికి వచ్చారంటే వారు.. ఏ స్థాయికి వెళ్లారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కాగా, పంజాబ్ రాష్ట్రంలోని భటిండా (Bhatinda)కు చెందిన దంపతులు 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-13 కింద విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణలో భాగంగా తన భార్య క్రూరంగా తనను హింసిస్తోందని భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణను నిరూపించేందుకు రికార్డ్ చేసిన కాల్ రికార్డింగ్స్‌కు సంబంధించి సీడీని ఫ్యామిలీ కోర్టుకు సమర్పించాడు. ఈ క్రమంలోనే తన అనుమతి లేకుండా సంభాషణలు రికార్డ్ భర్త రికార్డు చేశాడని, వాటిని సాక్ష్యంగా స్వీకరించడం తన ప్రాథమిక గోప్యతా హక్కును ఉల్లంఘించడమేని భార్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆమె వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆ సాక్ష్యాధారాలను స్వీకరించబోమని వెల్లడించింది. అయితే, హైకోర్టు తీర్పును భర్త సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. దాంపత్య వివాదాల కేసులలో భార్య లేదా భర్త సీక్రెట్ కాల్ రికార్డింగ్స్ ఇక నుంచి ఆధారాలుగా స్వీకరించబడతాయని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.






