- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం, నగల కాలంపోయింది.. అదనపు కట్నంగా కిడ్నీ కావాలట!
మనం దేశంలో వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: మనం దేశంలో వరకట్నం (Dowry) ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. వరకట్నాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజల్లో అవగాహనా కల్పించే ప్రయత్నాలు చేస్తుంది. అయినా, ఇంకా ఎంతో మంది వధువు కుటుంబం నుంచి నగదు, బైకులు, బంగారు ఆభరణాలు వంటి బహురూపాలలో వరకట్నాన్ని ఆశిస్తూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. తాజాగా బిహార్‌లో జరిగిన ఒక దారుణ ఘటన ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.
బిహార్‌లోని (Bihar) ముజఫర్‌పుర్ జిల్లా మిఠన్‌పురా ప్రాంతానికి చెందిన దీప్తికి 2021లో బోచహాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది. మొదట కొన్ని నెలలు దీప్తీతో అంతా బాగానే ఉన్నారు. క్రమంగా అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను వేధించటం ప్రారంభించారు. పుట్టింటి నుంచి డబ్బు, బైక్ తీసుకురావాలని అత్తమామలు, భర్త కలిసి దీప్తిని బలవంతం చేయసాగారు.
ఇంతలోనే దీప్తి భర్తకు కిడ్నీ (Kidney) సమస్య ఏర్పడింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమెను మరింత దారుణమైన ఒత్తిడికి గురిచేశారు. తన కిడ్నీని భర్తకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో, ఆమెను చావబాది, పుట్టింటికి పంపించేశారు. ఈ ఘోరాన్ని భరించలేక దీప్తి తన పుట్టింటి సాయంతో మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజీ ప్రయత్నాలు విఫలమవడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముజఫర్‌పుర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, దీప్తి భర్తతోపాటు అతని తల్లి, తండ్రి, మరొక బంధువును నిందితులుగా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.






