- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా క్షిపణుల నుంచి శత్రుదేశం తప్పించుకోలేదు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
by Kema Shiva Kumar |
భారత్ వద్ద ఉన్న అత్యాధునికి క్షిపణుల నుంచి ఏ శ్రతుదేశం తప్పించుకోలేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కామెంట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ వద్ద ఉన్న అత్యాధునికి క్షిపణుల నుంచి ఏ శ్రతుదేశం తప్పించుకోలేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కామెంట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను ఇవాళ సందర్శించారు. అక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేసిన నేపథ్యంలో వాటిని సైన్యానికి అప్పగిస్తూ రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. దాయాది పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం ఏదైనా ఇండియాన్ ఆర్మీ సిద్ధంగా ఉంటుందని, సైనికుల శక్తి, పరక్రమాలు వెలకట్టలేనివని అన్నారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశం తప్పించుకోలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Next Story






