- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెండింటిపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని.. దీంతో రైతులకు ఎంతో లాభదాయకమని అన్నారు. అన్నదాతల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయని కామెంట్ చేశారు. యాక్సియం-4 (Axiom-4) మిషన్ దిగ్విజయమైందని.. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. భారత సైనిక పాటవాలను శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రూపంలో ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని కొనియాడారు. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో భారత సైన్యం తమ వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిందని అన్నారు. మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. కేవలం 22 నిమిషాల్లో శ్రతు స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు.
నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం..
మేడ్ ఇన్ ఇండియా (Made In India) ఆయుధాలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తుండటం శుభ పరిణామమని ప్రధాని మోడీ అన్నారు. శాంతి-ప్రగతి భుజం, భుజం కలిసి నడుస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదం (Terrorism), నక్సలిజం (Naxalism) దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నాయని అన్నారు. ఇక నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నామని తెలిపారు. దేశంలో వందలాది జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయని అన్నారు. గతంలో రెడ్ కారిడార్లు (Red Corridors)గా చెప్పుకున్న ప్రాంతాలు గ్రీన్ గ్రోత్ జోన్లలోకి వస్తున్నాయని తెలిపారు. 2014కి ముందు ఆర్థిక రంగంలో భారత్ పదో స్థానంలో ఉండేదని.. నేడు ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. 25 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు.
అన్ని పార్టీలకు కృతజ్క్షతలు..
దేశంలో ఒకప్పుడు రెండంకెల స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంటే.. నేడు అది 2 శాతానికి పడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) యావత్ ప్రపంచం చూసిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశ హితం కోసం పలు పార్టీలు, పలు రాష్ట్రాల ప్రతినిధులు పలు దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై విస్తృతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలకు ప్రధాని ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.






