- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడు ఖండాలు చుట్టేయాలనే కోరిక.. అంటార్కిటికాలో ల్యాండ్ అవ్వగానే అరెస్ట్!

దిశ, వెబ్ డెస్క్: ఒంటరిగా ఏడు ఖండాలను చుట్టేయాలనుకున్న ఓ యువ పైలట్‌కు మధ్యలోనే చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు తీసుకోకుండా అంటార్కిటికాలో ల్యాండ్ అవ్వటంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. అమెరికాకు చెందిన 19 ఏళ్ల పైలట్ ఈథన్ గువ్ (Ethan Guo) ఒంటరిగా ప్రపంచ దేశాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంటార్కిటికా (Antarctica)లో దిగే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అతడు పలు జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు చిలీ అధికారులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈథన్ గువ్ సెస్నా-182 విమానంలో 140 రోజులు ప్రయాణిస్తూ ఇప్పటికే ఆరు ఖండాలపై విజయవంతంగా ప్రయాణం పూర్తి చేశాడు. చివరికి అంటార్కిటికాలోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన చిలీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వల్ల అంటార్కిటికా, మగల్లన్స్ ప్రాంతాలలో వాయురవాణా భద్రతకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు. పైలట్ తన ప్రయాణానికి సంబంధించిన సరైన ఆధారాలను చూపడంలో విఫలమయ్యారని అధికారులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ గగనతల సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతడికి జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సదరు పైలట్ ఒంటరిగా ఏడు ఖండాలకు ప్రయాణించి విరాళాలను సేకరించి వాటిని క్యాన్సర్ బాధితులకు ఇవ్వాలనే ఆతోచనతో ఈ ప్రయాణం మొదలుపెట్టారని అతడి తరఫు లాయర్ పేర్కొన్నారు.






