- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tesla Car: టెస్లా కార్ల డెలివరీ స్టార్ట్.. దేశంలో ఫస్ట్ కస్టమర్ వివరాలు ఇవే
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా సంస్థ భారత్ లో తమ కార్ల డెలివరీ మొదలు పెట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల సంస్థ ఇటీవలే భారత్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గత జులై 15న ముంబయి లో (Mumbai) తొలి షో రూమ్ ను ప్రారంభించింది. మిడ్ రేజ్ ఎస్ యూవీ 'మోడల్ వై' విక్రయాల కోసం బుకింగ్స్ తీసుకున్న ఈ సంస్థ తాజాగా డెలవరీస్ మొదలు పెట్టింది. ఇవాళ భారత దేశంలో మొట్టమొదటి టెస్లా కార్ (First Tesla Car) డెలివరీ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న టెస్లా కార్ ను భారత్ లో అందుకున్న తొలి కస్టమర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
తొలి కస్టమర్ గా మినిస్టర్:
భారత్ లో టెస్లా కార్ ను అందుకున్న తొలి వ్యక్తిగా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్ (Prathap Sarnaik) నిలిచారు. ఇవాళ ముంబయి లోని టెస్లా ఎక్స్ పీరియెన్స్ సెంటర్ లో సంస్థ ప్రతినిధులు వైట్ కలర్ టెస్లా మోడల్ వై కారు తాళాలు మంత్రి చేతికి అందజేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశానని, పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ సర్ నాయక్ తెలిపారు.
భారీగా బుకింగ్స్:
చైనాలోని తమ ప్లాంట్ లో పూర్తిగా తయారైన కార్లను దిగుమతి చేసుకుని టెస్లా ఈ విక్రయాలు చేపట్టింది. ప్రస్తుతం రెండు వేరియంట్లలో ఈ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా ఒక్క సారి చార్జింగ్ చేస్తేత 500 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. లాంగ్ రేంజ్ వీల్ డ్రైవ్ మోడల్ వాహనం ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు. ఇది ఒక్క చార్జితో 622 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టెస్లా కార్ల కోసం ఇప్పటికే 600 బుకింస్ వచ్చాయి. టెస్లా ఈ సంవత్సరం భారతదేశానికి 350 నుండి 500 కార్లను రవాణా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.






