రగులుకున్న ‘డిలిమిటేషన్’ చిచ్చు.. ఢిల్లీ వర్సెస్ తమిళనాడుగా మారుతున్న పోరు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-20 07:35:37  IST  )

నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాక రేపుతోంది. ఢిల్లీ వర్సెస్ తమిళనాడుగా పోరు మారుతోంది.

రగులుకున్న ‘డిలిమిటేషన్’ చిచ్చు.. ఢిల్లీ వర్సెస్ తమిళనాడుగా మారుతున్న పోరు!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, దానిని డీఎంకే తన ప్రధాన ఎన్నికల అస్త్రంగా మలచుకుంటుండగా.. విపక్షాల మధ్య పొత్తులు, కొత్త పార్టీల ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డిలిమిటేషన్ లొల్లి..

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల పార్లమెంట్ స్థానాలు తగ్గి అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంకే (DMK) తన ప్రచారాన్ని ‘రాష్ట్ర హక్కులు వర్సెస్ కేంద్ర పెత్తనం’ అనే దిశగా నడిపిస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, ప్రాజెక్టుల్లో వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ తమిళ సెంటిమెంట్‌ను బలంగా వినియోగిస్తోంది.

పొత్తులపై ప్రభావం..

డీలిమిటేషన్ బిల్లుతో ఏఐఏడీఎంకే (AIADMK), బీజేపీ మధ్య సంబంధాలు ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను పొత్తులతో ముడిపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ నటుడు విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుండగా.. ప్రతిపక్షాలు వీటిని కేవలం ఓట్ల కోసం ఇచ్చే ‘ఉచితాలు’గా అభివర్ణిస్తున్నాయి.

Next Story