ఆకాశంలో కనిపించని నెలవంక.. ఎల్లుండి రంజాన్ పండుగ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 15:15:44  IST  )

ఆకాశంలో ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో భారత్‌లో ఎల్లుండి రంజాన్ పండుగపై క్లారిటీ వచ్చింది.

ఆకాశంలో కనిపించని నెలవంక.. ఎల్లుండి రంజాన్ పండుగ
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. ఇవాళ ఆకాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీనితో ముస్లింలు రేపు ఉపవాస ప్రక్రిను పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, లక్నో వంటి ప్రధాన నగరాల్లో ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తి కానుంది. పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు వివిధ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.

ఇక హైదరాబాద్‌లోని చారిత్రాత్మక మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ ఈద్గా వద్ద భారీ ఎత్తున ప్రార్థనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలపై పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకుంటుండగా, భారత్‌లో మాత్రం నెలవంక కనిపించని కారణంగా శనివారం వేడుకలు జరగనున్నాయి. ఈ పండుగతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగిసి, శవ్వాల్ మాసం ప్రారంభం కానుంది.

Next Story