రాజ్యాంగమే అత్యున్నతమైనది.. పార్లమెంట్ కాదు: సీజే బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

చాలా మంది పార్లమెంట్ (Parliament) అత్యున్నతమైనది అంటారు కానీ.. తన దృష్టిలో భారత రాజ్యాంగ (Constitution of India)మే పరమోన్నతమైనదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు.

రాజ్యాంగమే అత్యున్నతమైనది.. పార్లమెంట్ కాదు: సీజే బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది పార్లమెంట్ (Parliament) అత్యున్నతమైనది అంటారు కానీ.. తన దృష్టిలో భారత రాజ్యాంగ (Constitution of India)మే పరమోన్నతమైనదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు. ఇవాళ ఆయన మహారాష్ట్రలోని అమరావతి (Amaravati)లో తన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ..సుప్రీం కోర్టు ‘మౌలిక నిర్మాణ సిద్ధాంతం’ ఆధారంగా ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ, దాని మౌలిక నిర్మాణాన్ని మార్చలేరని అన్నారు.

ప్రతి ఒక్కరికీ నివసించేందుకు ఇల్లు ఉండాలి.. బుల్డోజర్ (Bulldozer) న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్ధించుకున్నారు. తాము విధులు నిర్వర్తిస్తున్నామని విషయాన్ని న్యాయమూర్తులు ఎల్లప్పుడు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు భారత రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయని అన్నారు. తీర్పుల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారన్నది న్యాయమూర్తులను ప్రభావితం చేయకూడదని.. స్వతంత్రంగా ఆలోచించాలని పేర్కొన్నారు. వాస్తవానికి తాను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నప్పటికీ, తండ్రి తనను న్యాయవాదిగా చూడాలని కోరుకున్నారని బీఆర్ గవాయి తెలిపారు.

Next Story