బీజేపీని వెనక్కి నెట్టేసిన కాక్రోచ్ జనతాపార్టీ.. టెన్షన్‌లో కాంగ్రెస్?

by Ajay Maddhiboyina |

కాక్రోచ్ జనతా పార్టీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. ఈ పేరుతో ఇన్ స్టాగ్రామ్‌లో పేజీ క్రియేట్ చేయగా ఇప్పటికే ఫాలోవర్ల సంఖ్య 8.8 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే ఆ పేజీని కాక్రోచ్ జనతాపార్టీ వెనక్కినెట్టడం షాకింగ్ గా మారింది.

బీజేపీని వెనక్కి నెట్టేసిన కాక్రోచ్ జనతాపార్టీ..  టెన్షన్‌లో కాంగ్రెస్?
X

దిశ, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. ఈ పేరుతో ఇన్ స్టాగ్రామ్‌లో పేజీ క్రియేట్ చేయగా ఇప్పటికే ఫాలోవర్ల సంఖ్య 8.8 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే ఆ పేజీని కాక్రోచ్ జనతాపార్టీ వెనక్కినెట్టడం షాకింగ్ గా మారింది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుతం 13.3 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉండ‌గా ఆ పేజీని సైతం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ బీట్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క్రియేట్ చేసిన ఐదు రోజుల‌కు బీజేపీని దాటివేయ‌డంతో మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా వెన‌క్కి నెట్టేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో టెన్ష‌న్ మొద‌లైంది. ఇక కాక్రోచ్ జ‌న‌తాపార్టీ విష‌యానికి వ‌స్తే ఇది ఒక సెటైరిక‌ల్ పొలిటిక‌ల్ మూవ్ మెంట్. ఇటీవ‌ల సుప్రీంకోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే ఈ మూవ్ మెంట్ కు కారణం అయ్యాయి.

ఉద్యోగం దొరక్క సోషల్ మీడియాలో, యాక్టివిజంలో కాలం గడిపే కొందరు యువకులను, నకిలీ డిగ్రీలతో వ్యవస్థల్లోకి ప్రవేశించి విమర్శలు చేసేవారిని సూర్యకాంత్ బొద్దింకలుగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలే పెను దుమారం రేపాయి. దేశంలోని యువత అంతా మే బీ కాక్రోచ్... నేను కూడా బొద్దింకనే అనే నినాదాన్ని హైలెట్ చేశాయి. ఈ క్రమంలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్ స్టా పేజీ క్రియేట్ చేసి ఏఐ ద్వారా వ్యంగ్యంగా చేసిన వీడియోలు, ఫోటోలను షేర్ చేశాడు. ఇది క్రియేట్ చేసిన కేవలం 5 రోజుల్లోనే బీజేపీని దాటేయడంతో మరోసారి దేశంలో పెద్ద చర్చగా మారింది. మరోవైపు ఈ పార్టీలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు కూడా డిఫరంట్ గా, వ్యంగ్యంగా ఉన్నాయి. ఇది ఒక సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా చేరే సభ్యులు నిరుద్యోగులుగా ఉండాలని, విపరీతమైన బద్ధకం ఉండాలని, 24 గంటలే ఆన్ లైన్ లోనే ఉండి, వ్వస్థలపై ప్రొఫెషనల్ గా విమర్శలు చేయాలని పేర్కొన్నారు.

Next Story