- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా బిల్లు వీగిపోవడానికి కేంద్రానిదే బాధ్యత: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్ ప్రక్రియతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ (మహిళా రిజర్వేషన్) బిల్లు వీగిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ (మహిళా రిజర్వేషన్) బిల్లు వీగిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టింది ముమ్మాటికీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కాదని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన అంశమని ఆమె తేల్చి చెప్పారు. శుక్రవారం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందకుండా వీగిపోయిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: ప్రియాంక
ఈ బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమని ముందు నుంచీ తెలుసునని ప్రియాంక పేర్కొన్నారు. ‘ఇది కేవలం మహిళా రిజర్వేషన్ల అంశం కాదు.. ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా కోటాను ముడిపెట్టడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. ఈ బిల్లు వీగిపోవడం మన దేశ ప్రజాస్వామ్యానికి దక్కిన అతి పెద్ద విజయం’ అని ఆమె అభివర్ణించారు. హాథ్రస్, ఉన్నావో, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో మహిళలపై దారుణాలు జరిగినప్పుడు కనీస చర్యలు తీసుకోని వారు, ఇప్పుడు ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ఆలోచనా విధానం గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదమని బీజేపీని ఉద్దేశించి ఆమె విమర్శించారు.
వ్యక్తిగత నష్టంగా అనిపిస్తోంది: కంగనా రనౌత్
మరోవైపు బిల్లు వీగిపోవడం పట్ల బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన రోజని ఆమె విచారం వ్యక్తం చేశారు. ‘సభలో ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఎన్నడూ జరగలేదు. ప్రతిపక్షాలు మహిళల మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇది నాకు వ్యక్తిగత నష్టంగా అనిపిస్తోంది’ అని కంగనా వాపోయారు.






