- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG ALERT: మొబైల్ ఫోన్ నుంచి భారీ శబ్ధం.. రేపు కంగారు పడాల్సిన పనిలేదా?
మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగుతూ, స్క్రీన్‌పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నుండి ఏదైనా సందేశం కనిపిస్తే అస్సలు కంగారు పడకండి.

దిశ, వెబ్‌డెస్క్: మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగుతూ, స్క్రీన్‌పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నుండి ఏదైనా సందేశం కనిపిస్తే అస్సలు కంగారు పడకండి. అది ఎటువంటి ప్రమాద హెచ్చరిక కాదు, ప్రభుత్వం చేపట్టిన ఒక కీలకమైన పరీక్ష మాత్రమే. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్' (Cell Broadcast Alert) వ్యవస్థను పరీక్షిస్తోంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 'సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్' పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తోంది.
అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ మొబైల్ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి నెట్‌వర్క్ జాప్యం లేకుండా వేగంగా హెచ్చరికలను పంపడం ఈ సిస్టమ్ ప్రత్యేకత. కాబట్టి, మీ ఫోన్‌కు ఇటువంటి 'టెస్ట్ అలర్ట్' వచ్చినప్పుడు అది కేవలం వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని గుర్తించండి.






