భారత్-పాక్ యుద్ధం తధ్యం.. NOTAM జారీ చేసిన కేంద్రం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-06 15:09:58  IST  )

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారత్-పాక్ యుద్ధం తధ్యం.. NOTAM జారీ చేసిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తుండగా... పాక్ కూడా ఆ దేశ ఆర్మీతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం ముంచుకు రావొచ్చుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో NOTAM(Notice To Air Men) జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు రాజస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు చేపట్టనున్నట్టు కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30 తోసహ అన్నిరకాల యుద్ధ విమానాలు ఈ మాక్ డ్రిల్ లవం పాల్గొననున్నాయి.

దీంతో పైలట్లను అప్రమత్తం చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air force) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నోటమ్ అనగా వైమానిక మాక్ డ్రిల్ వంటిది. కాగా ఈ సమయంలో అటుగా వెళ్తున్న అన్ని విమాన ప్రయాణాలపై ప్రభావం చూపనుండగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా విమానాశ్రయాలకు లేఖలు అందినట్టు సమాచారం. అయితే ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాలు గగనతల ప్రయాణాలకు అనుమతులు రద్దు చేస్తూ ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైమానిక దాడులు జరగనున్నాయనే రహస్య సమాచారం మేరకు వైమానిక దాడులపై అవగాహన కోసం రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్స్(Civil Mack Drill) నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయగా.. ఇపుడు నోటమ్ జారీ చేయడంతో... ఏ క్షణంలో అయినా భారత్-పాక్ మధ్య యుద్ధం ముంచుకు రావొచ్చునని తెలుస్తోంది.

Next Story